వదంతులు క్రియేట్ చేయవద్దంటున్న గుణశేఖర్

Published on Jan 21, 2021 3:00 am IST


‘రుద్రమదేవి’ చిత్రంతో పిరియాడికల్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయడంలో తన ప్రతిభను నిరూపించుకున్న సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తన తర్వాతి చిత్రంగా ‘శకుంతలం’ను ప్రకటించారు. రానాతో చేయవలసిన ‘హిరణ్యకశిప’ మొదలుపెట్టడానికి ఇంకా సమయం ఉండటంతో ఈ సినిమాను ట్రాక్ ఎక్కించారు ఆయన. ఇది శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ. మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు.

ఇందులోని శకుంతల పాత్రను ప్రముఖ హీరోయిన్ సమంత చేయనుంది. సమంత లాంటి స్టార్ నటి సరసన దుష్యంతుడి పాత్రలో ఏ హీరో నటిస్తాడని విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ వదంతులకు కొదవ ఉండదు కాబట్టి దుష్యంతుడి పాత్రలో నటించబోయేది ఆ హీరోనే అంటూ పలువురి పేర్లు వినబడ్డాయి. దీంతో స్పందించిన గుణశేఖర్ సమంత మినహా మిగతా పాత్రల్లో నటించబోయే నటీనటుల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఏవరెవరి పేర్లనో ప్రచారం చేయవద్దని అందరినీ కోరారు. మరి ఇంత జాగ్రత్తపడుతున్న ఆయన చివరికి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :