‘ది ఘోస్ట్’ నుండి గన్స్ & స్వార్డ్స్ యాక్షన్ వీడియో రిలీజ్

Published on Sep 22, 2022 6:03 pm IST

కింగ్ అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఈ మూవీ లో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మించగా భరత్ సౌరభ్ సంగీతాన్ని, మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు. ఫస్ లుక్ టీజర్, తమహాగనే థీమ్, థియేట్రికల్ ట్రైలర్, వేగం లిరికల్ సాంగ్ ఇలా అన్నిటితో ఆడియన్స్ లో ది ఘోస్ట్ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అనే చెప్పాలి.

ఇక ఈ మూవీ నుండి నేడు కొద్దిసేపటి క్రితం గన్స్ & స్వార్డ్స్ యాక్షన్ వీడియోని రిలీజ్ చేసింది యూనిట్. ఈ వీడియోలో హీరో నాగార్జున, హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఇద్దరూ కూడా ఎంతో కష్టపడి గన్స్, స్వార్డ్స్ పట్టుకుని ట్రైనింగ్ తీసుకోవడం గమనించవచ్చు. భారీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 5 న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో గుల్ పనాగ్, మనీష్ చౌదరి, వైష్ణవి గానట్రా, శ్రీకాంత్ అయ్యంగార్, రవి వర్మ తదితరులు ఇతర పాత్రలు చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :