సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ కాంబో మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో మహేష్ బాబు చాలా రోజుల తరువాత మంచి మాస్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరాం, సునీల్, ఆలీ, హైపర్ ఆది తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.
అయితే రిలీజ్ కి ముందే ఇప్పటికే డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ విషయంలో పెద్ద రికార్డు ధరకు అమ్ముడుపోయిన ఈ మూవీ యొక్క ఏపీ, తెలంగాణా థియేట్రికల్ రైట్స్ రూ. 120 కోట్లకు అలానే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 155 కోట్లకు క్లోజ్ కానున్నాయట. మొత్తంగా ఇది రీజినల్ సినిమాల్లో భారీ రికార్డు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్న గుంటూరు కారం మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు మేకర్స్.