వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” ఒకటి కాగా సరిగ్గా ఇదే సినిమాతో క్లాష్ కి సిద్ధం అయ్యిన మరో భారీ చిత్రమే “హను మాన్”.
యంగ్ హీరో తేజ సజ్జ అలాగే టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ నుంచి ఒక యూనిక్ కాన్సెప్ట్ తో మెయిన్ గా భారీ విజువల్స్ తో వస్తున్నా సినిమా ఇది కావడంతో దీనిపై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే అల్టిమేట్ గా ఈ రెండు సినిమాలు ఒకే డేట్ లో లాక్ అయ్యి ఉన్నాయి కానీ ఇప్పుడు హను మాన్ రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.
దీనితో ఈ సినిమా గుంటూరు కారం క్లాష్ నుంచి తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే హనుమాన్ ఓ రోజు ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ అయ్యే సూచనలు ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.