నార్త్ ఆడియెన్స్ కి మరోసారి ట్రీట్ ఇచ్చేందుకు “గుంటూరు కారం”?

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా ఎలా ఉన్నా కూడా పాటలు మాత్రం ఈ సినిమా నుంచి ఆడియెన్స్ కి ఓ రేంజ్ లో ఊపేసాయి.

అలాగే ఓటిటిలో కూడా ఈ చిత్రం మంచి ఆదరణ అందుకుంది. ఓటిటిలో హిందీలో కూడా వచ్చిన ఈ చిత్రం అప్పుడు హిందీ వెర్షన్ లీడ్ లో ట్రెండ్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా గుంటూరు కారం మరోసారి ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతుంది అని తెలుస్తుంది. హిందీలో లేటెస్ట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న సర్టిఫికెట్ వైరల్ గా మారింది. దీనితో హిందీలో 2 గంటల 27 నిమిషాల రన్ టైం సినిమా టెలికాస్ట్ కి రాబోతున్నట్టుగా ఇపుడు టాక్. ఇంకా డేట్ ఏంటి ఎప్పుడు అనేది క్లారిటి లేదు కానీ హిందీలో స్మాల్ స్క్రీన్ పై ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూడాలి.

Exit mobile version