మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం “గుంటూరు కారం”. మరి భారీ అంచనాలు నడుమ వచ్చి రీజనల్ గా రికార్డు వసూళ్లు అందుకున్న ఈ చిత్రంలో చాలా అంశాలు ముందు డివైడ్ టాక్ తో స్టార్ట్ అయ్యి క్రేజీ రెస్పాన్స్ ని అందుకున్నవి చాలా ఉన్నాయి.
అలాంటి వాటిలో సెన్సేషనల్ హిట్ సాంగ్ కుర్చీ మడత పెట్టి కూడా ఒకటి. చిన్న పెద్ద ఆడవాళ్ళలో కూడా ఎంతో క్రేజ్ ని తెచ్చుకున్న ఈ సాంగ్ ఇప్పుడు రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. వచ్చిన కొన్ని నెలల్లోనే 100 మిలియన్ వ్యూస్ కొట్టేసిన ఈ సాంగ్ లేటెస్ట్ గా మరో రికార్డు మైల్ స్టోన్ 200 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి నాన్ స్టాప్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.
దీనితో ఈ సాంగ్ హవా ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా సాంగ్ కి భారీ రీచ్ ని అందుకోగా రానున్న రోజుల్లో మరింత స్ట్రాంగ్ గా వెళుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Feel the pulse of sensation with the electrifying #KurchiMadathapetti full video song from #GunturKaaram as it skyrocketed to over 2⃣0⃣0⃣M+ views on #YouTube.
A @MusicThaman Musical ????
✍️ @ramjowrites
???? @itsahithii @srikrisinSUPER????… pic.twitter.com/ilak2XTVWi
— Aditya Music (@adityamusic) April 20, 2024