మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అవైటెడ్ హ్యాట్రిక్ చిత్రం “గుంటూరు కారం” కోసం తెలిసిందే. మరి ఈ కాంబినేషన్ పై ఉన్న పిచ్చ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి.
మరి ఈ రెస్పాన్స్ తో అయితే మహేష్ బాబు నైజాం మార్కెట్ లో ఓ సాలిడ్ రికార్డు సెట్ చేస్తాడని చాలా మంది భావించారు. మరి ఇప్పుడు అనుకున్నట్టుగానే నైజాంలో “గుంటూరు కారం” చిత్రం అదరగొట్టేసింది. పి ఆర్ నంబర్స్ ప్రకారం మొదటి రోజే ఈ చిత్రం 16.9 కోట్ల షేర్(జి ఎస్ టి కలిపి) రాబట్టినట్టుగా తెలుస్తుంది.
దీనితో నైజాం మార్కెట్ లో మహేష్ బాబు తన గత చిత్రం సర్కారు వారి పాట రికార్డుని బ్రేక్ చేసుకోగా రీజనల్ గా ఆల్ టైం హైయెస్ట్ రికార్డు దీనితో సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇదంతా మిక్స్డ్ టాక్ తోనే వసూలు కావడం గమనార్హం. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని వారు నిర్మాణం వహించారు.