యుఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో దూసుకెళ్తున్న ‘గుంటూరు కారం’

యుఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో దూసుకెళ్తున్న ‘గుంటూరు కారం’

Published on Jan 7, 2024 3:02 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, హైపర్ ఆది, బ్రహ్మానందం నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.

ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ తో అందరిలో ఎంతో ఆసక్తిని ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ ప్రస్తుతం యుఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో ప్రస్తుతం దూసుకెళుతోంది. ఇప్పటికే అక్కడ రికార్డు షోలతో ఎన్నో లొకేషన్స్ లో రిలీజ్ అవుతున్న ఈమూవీ తాజాగా ప్రీ సేల్స్ పరంగా 500కె డాలర్స్ సొంతం చేసుకున్నట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అయిన ప్రత్యంగిరా సినిమాస్ వారు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే ఇంకా చాలా ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ కాలేదని, మంగళవారం వాటిని ఓపెన్ చేయనున్నట్లు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా వారు తెలిపారు. మరి రిలీజ్ అనంతరం గుంటూరు కారం ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు