“గుంటూరు కారం” ట్రైలర్..ఫ్యాన్స్ కి డబుల్ బ్లాస్ట్?

“గుంటూరు కారం” ట్రైలర్..ఫ్యాన్స్ కి డబుల్ బ్లాస్ట్?

Published on Dec 17, 2023 3:00 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్స్ శ్రీలీల మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం”. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం ట్రైలర్ కి సంబంధించి రీసెంట్ గానే ఓ క్రేజీ బజ్ అయితే బయటకి వచ్చింది.

మేకర్స్ ఈ జనవరి 1 కొత్త సంవత్సరం కానుకగా అయితే ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని టాక్ వచ్చిందని తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సాలిడ్ బజ్ ఏమిటంటే ఈ చిత్రం నుంచి కూడా రెండు ట్రైలర్స్ ని మేకర్స్ వదిలే ప్లాన్ లో ఉన్నారట. మొదట నార్మల్ ట్రైలర్ ఆ తర్వాత రిలీజ్ ట్రైలర్ ఇలా రెండు ట్రైలర్స్ రానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది నిజమైతే ఫ్యాన్స్ కి డబుల్ బ్లాస్టింగ్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు