‘గువ్వ గూటిలో’ లిరికల్ సాంగ్‌.. రెట్రో లుక్స్‌తో శ్రీ విష్ణు ‘స్వాగ్’ అదిరింది!

‘గువ్వ గూటిలో’ లిరికల్ సాంగ్‌.. రెట్రో లుక్స్‌తో శ్రీ విష్ణు ‘స్వాగ్’ అదిరింది!

Published on Sep 6, 2024 8:12 PM IST

యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’ ఇప్పటికే సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన ఏకంగా నాలుగు పాత్రల్లో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కాగా, ఈ చిత్ర టీజర్‌కు మాసివ్ రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాలోని ‘గువ్వ గూటిలో’ లిరికల్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సాంగ్ ఆద్యంతం రెట్రో బీట్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సాంగ్‌లో అతడి లుక్స్, డ్యాన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. యయాతి అనే రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ఓనర్‌గా శ్రీ విష్ణు సరికొత్త గెటప్‌లో కనిపించి మెప్పించాడు. ఇక ఈ పాటకు గోపీ సుందర్ అందించిన బీట్స్ పాటను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయని చెప్పాలి. ఈ పాటను మనో, గీతా మాధురి, స్నిగ్ధ శర్మ పాడారు.

ఈ సినిమాలో అందాల భామ రీతూ వర్మ, దక్ష నాగర్కర్, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని హసిత్ గోలి డైరెక్ట్ చేస్తున్నాడు. అక్టోబర్ 4న ‘స్వాగ్’ చూపెట్టేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు