విడాకులు తీసుకున్న జివి ప్రకాష్ కుమార్ – సైంధవి

కోలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవి ప్రకాష్ కుమార్ అతని భార్య అయిన సైంధవి విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై క్లారిటీ ఇస్తూ తాజాగా సోషల్ మీడియా లో ప్రెస్ నోట్ ను రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఆలోచన తర్వాత, సైంధవి మరియు నేను 11 సంవత్సరాల వివాహం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా మానసిక శాంతి మరియు మెరుగుదల కోసం. పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ విడిపోతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ తమ గోప్యతను అర్థం చేసుకోవాలని మరియు గౌరవించాలని ఆయన కోరారు. జివి ప్రకాష్ ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త ఎఆర్ రెహమాన్ మేనల్లుడు. అతను 2013లో సైంధవిని వివాహం చేసుకున్నాడు. సైంధవి ఒక ప్రముఖ సింగర్. జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన అనేక సూపర్‌హిట్ పాటలను కూడా ఆమె పాడారు. వీరికి 3 సంవత్సరాల కుమార్తె ఉంది. ఈ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Exit mobile version