ఈ వీకెండ్ కూడ సందడి గట్టిగానే ఉంటుంది

Published on Mar 3, 2021 12:05 am IST


లాక్ డౌన్ మూలాన ఆగిపోయిన సినిమాలన్నీ చకచకా పనులు ముగించుకుని విడుదలకు రెడీ అవుతున్నాయి. పెద్ద సినిమాలు లేని డేట్స్ చూసుకుని తమ చిన్న సినిమాల్ని రిలీజ్ చేసేస్తున్నారు నిర్మాతలు. గత వారం కూడ అరడజను సినిమాలు రిలీజ్ కాగా ఈసారి శుక్రవారం కూడ అరడజను సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. సందీప్ కిషన్ నటించిన ‘ఏ 1 ఎక్స్ ప్రెస్’ 5వ తేదీన రిలీజ్ కానుండగా రాజ్ తరుణ్ కొత్త చిత్రం ‘పవర్ ప్లే’ అదే రోజున రానుంది.

అలాగే థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ‘ఏ’ చిత్రం, టైమ్ కనెక్షన్ ఆధారంగా తయారుచేసిన కథాంశంతో రూపొందిన ‘ప్లే బ్యాక్’ కోడ్ అదే రోజున రానుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో రూపొందిన ‘షాదీ ముబారక్’ కూడ మార్చి 5వ తేదీనే విడుదలకానుంది. ఇలా ఇప్పటివరకు మొత్తం ఆరు సినిమాలు ఒకే రోజున రిలీజ్ డేట్ పెట్టుకున్నాయి. అంటే గత శుక్రవారం లాగానే ఈ శుక్రవారం కూస్ థియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడనున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలో ప్రేక్షకుల మన్ననలు పొందుతాయో చూద్దాం.

సంబంధిత సమాచారం :