‘హను మాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ టాలీవుడ్ స్టార్ హీరో ?

‘హను మాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ టాలీవుడ్ స్టార్ హీరో ?

Published on Dec 31, 2023 3:04 AM IST


యువ నటుడు తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా అ, జాంబీ రెడ్డి, కల్కి సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ హను మాన్. యాక్షన్ థ్రిల్లింగ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రలు చేస్తుండగా అనుదీప్ దేవ్, హరి గౌరా, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన హను మాన్ జనవరి 12న విడుదల కానుంది. విషయం ఏమిటంటే, తమ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 7న ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ప్రమోషనల్ ఇంటర్వూస్ లో భాగంగా తెలిపారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే ఇటీవల చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ప్రభాస్ గార్లను కలిశానని, వారు తమ నుండి మా సినిమా కోసం ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తామన్నారని తెలిపారు.

అయితే వీరిలో ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్నారా అంటూ ఒక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడుగగా, అది ఇప్పటికిప్పుడు అయితే తాను చెప్పలేనని, ఒకవేళ వీరిలో ఎవరైనా వస్తే అంతకంటే హ్యాపీ ఇంకేముంటుందని అన్నారు ప్రశాంత్ వర్మ. కాగా ఆయన మాటలను బట్టి తప్పకుండా ఒక టాలీవుడ్ స్టార్ హీరో హను మాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. మరి వారు ఎవరు అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు