మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్న “హను మాన్” దర్శకుడు


ఇప్పుడు మన తెలుగు సినిమా దగ్గర యువ దర్శకులు ఏ తరహా సినిమాలు తీస్తున్నారో చూస్తూనే ఉన్నాం. స్టార్ దర్శకులకి ధీటుగా సాలిడ్ కంటెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్నారు. అయితే ఈ దర్శకుల్లో ఈ ఏడాది టాలీవడ్ నుంచి సెన్సేషనల్ హిట్ “హను మాన్” ని అందించిన ప్రశాంత్ వర్మ కూడా ఒకడు. సినిమా సినిమాకి జానర్ ని మారుస్తూ మన తెలుగు సినిమా నుంచి కొత్త కంటెంట్ ప్రపంచ ఆడియెన్స్ కి అందించే పనిలో తాను ఉన్నాడు.

దీంతో రానున్న రోజుల్లో ప్రశాంత్ వర్మ లైనప్ కోసం మంచి ఆసక్తిగా మారగా ఇప్పుడు ఈ లైనప్ పై మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. ప్రశాంత్ వర్మ ఒక సెన్సేషనల్ లైన్ పై ఇప్పుడు వర్క్ చేస్తున్నాడట. ఇది ఆడియెన్స్ కి ఓ రేంజ్ ఫీస్ట్ ఇవ్వడమే కాకుండా ఇది ఓ భారీ కాంబినేషన్ లా మారే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఇక దీనిపై మరింత క్లారిటీ ముందు రోజుల్లో రానుంది అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ “జై హనుమాన్”, ఇంకా కొన్ని సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

Exit mobile version