“హను మాన్” ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ప్రముఖ క్రిటిక్

“హను మాన్” ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ప్రముఖ క్రిటిక్

Published on Jan 11, 2024 1:44 PM IST


పాన్ ఇండియా వైడ్ గా మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి రాబోతున్న మన టాలీవుడ్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ అలాగే హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం “హను మాన్” కోసం తెలిసిందే. ఎప్పుడు నుంచో పాన్ ఇండియా ఆడియెన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ కి వస్తుంది. మరి ఈ సినిమా పట్ల బాలీవుడ్ ఆడియెన్స్ లో కూడా మంచి ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.

ఇక బాలీవుడ్ లో ప్రముఖ క్రిటిక్ అయినటువంటి తరన్ ఆదర్శ్ నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. తాను ఒక్క మాటలో చెప్పాలి అంటే హను మాన్ ఫాసినేటింగ్ గా ఉందని తెలిపాడు. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాడు అని కొనియాడారు. దీనితో అయితే ప్రశాంత్ వర్మ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మరి నిజంగా సినిమా ఈ రేంజ్ లో ఉందో లేదో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు