“హను మాన్” : ఓటిటి రిలీజ్ ముందు మేకర్స్ స్ట్రాటజీస్

“హను మాన్” : ఓటిటి రిలీజ్ ముందు మేకర్స్ స్ట్రాటజీస్

Published on Feb 23, 2024 9:00 PM IST


ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో అండ్ డివోషనల్ చిత్రం “హను మాన్”. మరి భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని మించి పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ సక్సెస్ ని సాధించింది.

అంతే కాకుండా వారు బలంగా నమ్మినట్టుగానే థియేటర్స్ లో లాంగ్ రన్ తో దూసుకెళ్లిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి దగ్గరకి వస్తుంది. అయితే ఈ డేట్ దగ్గరకి వస్తున్నా సమయంలో ఇంకా థియేటర్స్ లో హను మాన్ ని ఎంజాయ్ చేయడానికి మాత్రం మేకర్స్ వేస్తున్న స్ట్రాటజీస్ ఇంప్రెసివ్ గా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికి మార్చ్ మొదటి వారంలో సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ కి వస్తుంది అని బజ్ ఉంది.

మరి ఇప్పుడు దీనికి ముందు వరకు థియేటర్స్ లో క్రమంగా టికెట్ రేట్స్ ని తగ్గిస్తున్నారు. గత వారమే తెలుగు స్టేట్స్ లో సింగిల్ స్క్రీన్స్ సహా మల్టిప్లెక్స్ లలో మరింత రీజనబుల్ రేట్స్ కి తీసుకొచ్చిన ఈ చిత్రం ఇప్పుడు మరో స్టెప్ తో వచ్చారు. ఈ వారం ఫిబ్రవరి 23 నుంచి 29 వరకు కూడా మొత్తం నేషనల్ చైన్స్ అన్నిటిలో కూడా హను మాన్ టికెట్ రేట్స్ కేవలం 112 రూపాయలకే వీక్షించవచ్చని కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఓటిటి రిలీజ్ లోపు సాధ్యమైనంతగా మరింత వసూళ్లు అందుకునే దిశగా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ మేకర్స్ వేస్తూ వెళ్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు