‘హను-మాన్’ జపాన్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్!

‘హను-మాన్’ జపాన్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్!

Published on Sep 25, 2024 11:20 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘హను-మాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా పూర్తి ఫిక్షనల్ సూపర్ హీరో మూవీగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. కాగా, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘హను-మాన్’ అన్ని భాషల్లో సక్సెస్ సాధించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా మారుతోంది. ఈ చిత్రాన్ని జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న జపాన్ దేశంలో రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా ట్వీట్ చేశాడు.

దీంతో ఈ సినిమా జపాన్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు