యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం జనవరి 12 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం అన్ని చోట్ల భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం హిందీ లో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం మొదటి వారాంతం కలెక్షన్లు కన్నడ లో సూపర్ హిట్ అయిన కాంతార, కేజీఎఫ్ లను బీట్ చేయడం జరిగింది. అంతేకాక పుష్ప ది రైజ్ తో ఈక్వల్ గా వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది మామూలు రికార్డ్ కాదు అని చెప్పాలి.
ఈ చిత్రం హిందీలో ఆదివారం రోజు 6.06 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. తెలుగు వెర్షన్ నార్త్ లో ఇప్పటి వరకు 1.09 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగా, హిందీ వెర్షన్ ఇప్పటి వరకూ 12.26 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. అక్కడ హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా హను మాన్ కి పోటీ ఎది లేదు. లాంగ్ రన్ లో ఈ సినిమా అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.