హను మాన్ : రఘునందన సాంగ్ పై సంగీత దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

హను మాన్ : రఘునందన సాంగ్ పై సంగీత దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

Published on Feb 20, 2024 7:09 AM IST

యంగ్ అండ్ టాలెంటడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “హను మాన్” కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సాధించిన విజయం దేశం అంతా చూసింది. కొన్ని ఇబ్బందులు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ కాగా ఈ సినిమాలో గూస్ బంప్స్ తెప్పించిన ఎన్నో సన్నివేశాలు పాటల్లో క్లైమాక్స్ పోర్షన్ కూడా ఒకటి.

మరి నటుడు సముద్రకని మాటలతో వచ్చే రఘునందన సాంగ్ తో మూవీ లవర్స్ కి థియేటర్స్ లో ప్రశాంత్ వర్మ సంగీత దర్శకుడు గౌర హరీష్ తో సాలిడ్ ట్రీట్ అందించారు. అయితే ఈ ఒక్క సాంగ్ విషయంలో మాత్రం సంగీత దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. రఘునందన సాంగ్ కి ఒక టైం లెస్ క్వాలిటీ అలాగే ఒక క్లాసిక్ గా నిలిచిపోతుంది అని నమ్ముతున్నాను అని ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా అయితే తాను ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. దీనితో ఈ సాంగ్ పట్ల తాను ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఫుల్ సాంగ్ అయితే ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు