44 ఏళ్ళే – రజినీకాంత్ కు కమల్ బర్త్ డే విషెస్

44 ఏళ్ళే – రజినీకాంత్ కు కమల్ బర్త్ డే విషెస్

Published on Dec 12, 2014 1:00 PM IST

Super-star-RAjini
సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు 64వ పడిలో అడుగుపెడుతున్నారు. అయితే, ఇతరులకు భిన్నంగా రజనీకాంత్ కు 44వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్టార్ హీరో, రజినీకాంత్ చిరకాల మిత్రుడు కమల్ హసన్ ఒక వీడియోను విడుదల చేశారు. విచిత్రం కాకపోతే, రజినికి 64వ సంవత్సరంలో అడుగు పెడితే, కమల్ హాసన్ 44 సంవత్సరాలే అని అభినందనలు తెలుపుతున్నారు అనుకుంటున్నారా..? వారిద్దరి మధ్య స్నేహం చిగురించి నేటికి 44 ఏళ్ళు నిండిన సందర్భంగా కమల్ కాస్త క్రియేటివ్ గా ఇలా బర్త్ డే విషెస్ తెలిపారు.

రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా నేడు విడుదలవుతున్న ‘లింగ’ సినిమా ఘనవిజయం సాధించాలని కమల్ కోరుకున్నారు. ఇలాంటి పుట్టినరోజులు రజిని మరెన్నో జరుపుకోవాలని, ఆరోగ్యకరమైన జీవితం సాగించాలని ఆకాంక్షించారు.

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ తమ అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు