బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

Published on Aug 14, 2014 2:00 AM IST

Bvsn-Prasad
బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్… సినిమాలే శ్వాసగా, సినిమాలే ప్రాణంగా జీవించే వ్యక్తి. అలనాటి అగ్ర హీరోలతో పాటు నేటి తరం స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో సినిమాలను నిర్మించారు. ఛత్రపతి, డార్లింగ్, సాహసం, అత్తారింటికి దారేది వంటి విజయవంతమైన చిత్రాలను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇండస్ట్రీ హిట్ సినిమాలు, ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయినా కించిత్ గర్వం ఆయనలో కనపడదు. హీరో హీరోయిన్లు, టెక్నిషియన్ల మంచి కోరుకునే వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమనే మస్తత్వం కల మంచి మనిషి, నిగర్వి ప్రసాద్ గారికి పుట్టిన రోజు నేడు.

123తెలుగు.కామ్ తరపున, ప్రేక్షకుల తరపున బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్లో మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని, ప్రేక్షకుల అలరించాలని కోరుకుందాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ వేరి హ్యాపీ బర్త్ డే టు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు