సమీక్ష : “హ్యాపీ ఎండింగ్” – సిల్లీగా సాగే బోరింగ్ కామెడీ డ్రామా !

సమీక్ష : “హ్యాపీ ఎండింగ్” – సిల్లీగా సాగే బోరింగ్ కామెడీ డ్రామా !

Published on Feb 3, 2024 3:02 AM IST
Happy Ending Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు: యష్ పూరి, అపూర్వ రావ్, అజయ్ ఘోష్, విష్ణు ఓ ఐ, ఝాన్సీ, అనితా చౌదరి తదితరులు

దర్శకుడు : కౌశిక్ భీమిడి

నిర్మాతలు: యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల

సంగీత దర్శకులు: రవి మదర్తి

సినిమాటోగ్రఫీ: అశోక్ సీపల్లి

ఎడిటింగ్: ప్రదీప్ ఆర్ మోరం

సంబంధిత లింక్స్: ట్రైలర్

యంగ్ హీరో యష్ పూరి హీరోగా అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “హ్యాపీ ఎండింగ్”. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

మన పురాణాల్లోని శాపాలు ఎలా అయితే పవర్ ఫుల్ గా పని చేశాయో.. అలాగే, ఓ శాపం నేటి తరం కుర్రాడికి వస్తే అతని జీవితం ఎలా మారిపోయింది అనే ఏ కోణంలో సాగింది ఈ కథ. హర్ష్ (యష్ పూరి) తన చిన్నతనంలో ఒక బాబాజీ చేత శపించ బడతాడు. ఆ శాపం ప్రకారం, ఎవరితో ఐతే హర్ష్ (శారీరకంగా – మానసికంగా లైంగిక పరంగా సన్నిహితంగా మెలుగుతాడో.. వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అవని (అపూర్వ రావ్)తో హర్ష్ ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ, తన వల్ల అవనికి ఎలాంటి కష్టం కలుగకూడదు అని హర్ష్ ఆమెకు శారీరకంగా దూరంగా ఉంటాడు. ఇంతకీ, హర్ష్ – అవని మధ్య ఎలాంటి ప్రేమ కథ నడిచింది ?, వీరిద్దరూ తమ ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశారు ?, చివరకు ఈ సినిమా హ్యాపీ ఎండింగా ? కాదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ముందుగా చెప్పుకున్నట్టే.. మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని ఈ “హ్యాపీ ఎండింగ్” కథను రాసుకున్నారు. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే మ్యాటర్ ఉంది. ఇక ఈ సినిమాలో యష్ పూరి పోషించిన ప్రధాన పాత్ర అయిన హర్ష్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ప్రేమ, పెళ్లి ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు సిల్లీ కామెడీ సీన్స్.. ఇలా మొత్తానికి హ్యాపీ ఎండింగ్ సినిమా కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ పూరి తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు.

అలాగే, తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ ‘యష్ పూరి’ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. అలాగే, హీరోయిన్ పాత్రలో నటించిన అపూర్వ రావ్ కూడా చాలా బాగా నటించింది. ఆమె పాత్ర కూడా పర్వాలేదు. ఝాన్సీ కూడా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. కీలక పాత్రలో అజయ్ ఘోష్ మెప్పించాడు. విష్ణు ఓ ఐ, అనితా చౌదరి తదితరులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కౌశిక్ భీమిడి మంచి ఫన్ వర్కౌట్ అయ్యే స్టోరీ లైన్ తీసుకున్నా.. దాన్ని ఇంట్రెస్టింగ్ ప్లే తో ఆసక్తికరంగా సినిమాని మలచలేక పోయారు. సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సిల్లీ ట్రాక్స్ తో బోరింగ్ క్యారెక్టర్స్ తో సినిమాని బోర్ కొట్టించారు. అసలు సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ కూడా సరిగ్గా కనెక్ట్ కావు. పైగా హర్ష్ క్యారెక్టర్ ట్రాక్ కూడా చాలా ఇల్లాజికల్ గా ఉంది.

దీనికి తోడు,చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. అలాగే కామెడీ కోసం కథను పూర్తి సినిమాటిక్ టోన్ లో నడిపాడు దర్శకుడు కౌశిక్. అలాగే, హీరో హీరోయిన్లు యష్ పూరి – అపూర్వ రావ్ మధ్య లవ్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. కొంచెం అయినా బెటర్ గా ఉండేది. సరే.. సినిమాలో లవ్ లేకపోతే పోయింది.. హీరో హీరోయిన్లు కొన్ని సీన్స్ లో అయితే మరీ సిల్లీగా బిహేవ్ చేస్తోన్న ఫీలింగ్ కలుగుతుంది.

మొత్తానికి ఈ హ్యాపీ ఎండింగ్ సినిమా కథ కథనాలు మరీ స్లోగా సాగడం అస్సలు బాగాలేదు. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. మొత్తానికి ఈ రెగ్యులర్ సిల్లీ బోరింగ్ కామెడీ డ్రామా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు కౌశిక్ భీమిడి ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించ లేకపోయాడు.

సాంకేతిక విభాగం :

పైన చెప్పుకున్నట్లు దర్శకుడు కౌశిక్ భీమిడి తాను రాసుకున్న కథను స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. అతను కథ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సంగీతం బాగాలేదు. అయితే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు. ఇక ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

‘హ్యాపీ ఎండింగ్’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సిల్లీ కామెడీ డ్రామా ఆకట్టుకోలేకపోయింది. సిల్లీ ట్రాక్స్, ఫేక్ ఎమోషన్స్ అండ్ బోరింగ్ ప్లే వంటి అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. కాకపోతే, కొన్ని బోల్డ్ సీన్స్, యష్ పూరి నటన, కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. మొత్తమ్మీద ఈ సినిమా మాత్రం నిరుత్సాహపరుస్తుంది.

123telugu.com Rating: 1.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు