హ్యాపీ ఎండింగ్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం. ఇది బోల్డ్ ట్రైలర్ల కారణంగా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. చాలా తక్కువ రోజుల్లోనే థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన ఆహా వీడియో దక్కించుకుంది.
హ్యాపీ ఎండింగ్ మే 3 నుండి స్ట్రీమింగ్ కానుందని వార్తలు రాగా ఇప్పుడు వాటి ప్రకారమే ఓటిటిలో వచ్చేసింది. కామెడీ కేపర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యష్ పూరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అపూర్వ రావు, అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, ఝాన్సీ మరియు అనితా చౌదరి కూడా హ్యాపీ ఎండింగ్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.