మెగా ఫ్యామిలీ కి పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని వార్తలు ఎప్పటికప్పుడు మీడియాలో వస్తూనే ఉన్నాయి. చిరు మరియు పవన్ ఎన్ని సార్లు ఈ వార్తలని ఖండించినా మళ్ళీ మళ్ళీ పుకార్లు పుడుతూనే ఉన్నాయి. తాజాగా అభిమానులు చేసిన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో నాగబాబు పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ అలాంటి వార్తలకి ఆజ్యం పోసింది. కానీ ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ చిరు 60వ బర్త్ డే బాష్ కి హాజరయ్యాడు. అంతే కాకుండా ఆయన ఈ వేడుకలో పవన్ తన అమ్మ నాన్నలలా భావించే అన్నయ్య చిరంజీవి, వదినమ్మ సురేఖ గారితో కాసేపు ఆనందంగా గడిపారు. ఈ ఫోటోలు కొన్ని బయటకి వచ్చాయి. అవి మెగా అభిమానులను మరింత ఆనందంలో ముంచెత్తాయి. చాలా రోజుల తర్వాత చిరంజేవి – పవన్ కళ్యాణ్ లను కలిసి చూడడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆ హ్యాపీ మోమెంట్ కి సంబందించిన ఫోటోలు మీకందిస్తున్నాం చూసి ఎంజాయ్ చెయ్యండి. అలాగే ఈ లవ్లీ మోమెంట్ పై మీ కామెంట్స్ ని కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాలయ్య, అజిత్ లకి పవన్ ప్రత్యేక శుభాకాంక్షలు.!
- ‘ది పారడైజ్’ కోసం బాలీవుడ్ విలన్
- ఓటీటీ సమీక్ష : జ్యువెల్ థీఫ్ – నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘పొలిమేర’ దర్శకుని మరో థ్రిల్లర్
- ‘రాజమౌళి’ సినిమా రిలీజ్ పై నాని క్లారిటీ !
- తనతో మాట్లాడనిదే నాకేమీ తోచదు – మోహన్ లాల్
- ‘ఎల్లమ్మ’కు ఆమె కూడానా..?
- ఐపీఎల్లో సంచలనం: 14 ఏళ్ల వయసులో శతకం సాధించిన వైభవ్