‘భగవంత్ కేసరి’ కి అందరి నుండి అప్రిసియేషన్ వస్తుండడం ఆనందంగా ఉంది – అనిల్ రావిపూడి

‘భగవంత్ కేసరి’ కి అందరి నుండి అప్రిసియేషన్ వస్తుండడం ఆనందంగా ఉంది – అనిల్ రావిపూడి

Published on Oct 21, 2023 3:00 AM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ కమ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించగా విలన్ పాత్రలో అర్జున్ రామ్ పాల్ కనిపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందింది. నిన్న మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ నుండే మంచి టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగిస్తూ కొనసాగుతోంది.

బాలకృష్ణ పవర్ఫుల్ రోల్ లో కనిపించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు. కాగా తమ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తుండడంతో యూనిట్ నేడు సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి భగవంత్ కేసరి కి మంచి అప్రిసియేషన్ వస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆడపిల్లలని లేడీ పిల్లలా కాకుండా పులి పిల్లలా పెంచాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ప్రతి ఒక్క ఆడ బిడ్డ తండ్రి కనెక్ట్ అవుతున్నారని అన్నారు.

బాలకృష్ణ గారి పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు కాజల్, శ్రీలీల, అర్జున్ రామ్ పాల్ ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించడం, అలానే టీమ్ మొత్తం కూడా ఎంతో కష్టపడడం వల్లనే ఈ విజయం సాధ్యం అయిందని తెలిపారు అనిల్ రావిపూడి. మొత్తంగా తమకు ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకాభిమానులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు