పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ మూవీ మార్చి 28న రిలీజ్ కావాల్సింది. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.
ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ఖమ్మంలో ప్రారంభమైనట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌లో పవన్ జాయిన్ అయ్యాడా లేదా.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ చివరి షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. దీంతో ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుని ఈ సినిమాను వేసవి కానుకగా మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో బాబీ డియోల్, నోరా ఫతేహి, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.