Pawan Kalyan: హరిహర వీరమల్లు.. తుఫాను ముందు నిశ్శబ్ధం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గురించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ గురించి నేడు మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని.. దీనికి ముందు తమ హీరో పవన్ కళ్యాణ్‌ను చిత్ర యూనిట్ కలిసినట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది.. హరిహర వీరమల్లు సినిమా వచ్చే ముందు ఈ సైలెన్స్ అని వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో పవన్ ఓ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు. ఈ సినిమాను జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version