“వీరమల్లు” ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడేనా..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే మరి ఈ చిత్రం ఎప్పుడో మొదలైనప్పటికీ ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ కొన్ని రోజులు కితమే మళ్ళీ పునః ప్రారంభం కాగా దీని తర్వాతే ఈ సినిమాలో పవన్ ఓ సాంగ్ ని పాడనున్నారు అని ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది.

అయితే ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సాంగ్ ని మేకర్స్ ఈ దీపావళి కానుకగా వదలబోతున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి ఇది నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంని మేకర్స్ వచ్చే ఏడాది మార్చ్ 28న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version