“వీరమల్లు” పార్ట్ 1 ఈ ఫార్మాట్ లో కూడానా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఈ సినిమాపై ఉండగా మొట్ట మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఒక వారియర్ రోల్ లో చేస్తున్న నేపథ్యంలో అప్పట్లో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ హైప్ సెట్ అయ్యింది.

అయితే ఇది క్రమేణా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎప్పుడో “సర్కారు వారి పాట”తో రిలీజ్ కి అనౌన్స్ చేశారు ఈ సినిమాని కానీ ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదు. మరి ఇలా అంచనాలు సన్నగిల్లుతున్న ఈ సినిమా ఇప్పుడిపుడే అంతిమదశకి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వైరల్ గా మారింది.

దీనితో వీరమల్లు పార్ట్ 1 ని మేకర్స్ 3డి ఫార్మాట్ లో కూడా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సింది. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ పై 3డి స్కానింగ్ కూడా ఫోటో షూట్ కోసం చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ 3డి రిలీజ్ పై ఓ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version