తొడగొట్టి సిసలైన రాజసంతో “వీరమల్లు” పవన్ పవర్ఫుల్ గ్లాన్స్.!

తొడగొట్టి సిసలైన రాజసంతో “వీరమల్లు” పవన్ పవర్ఫుల్ గ్లాన్స్.!

Published on Sep 2, 2022 10:34 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిస్టారికల్ చిత్రం “హరిహర వీరమల్లు”. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు అంతకంతకూ అంచనాలు పెంచుకుంటుంది. అయితే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా మేకర్స్ ఓ భారీ ట్రీట్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఒక అదిరిపోయే పవర్ గ్లాన్స్ ని అయితే ఈరోజు రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఒక వారియర్ గా పవన్ ని ఫస్ట్ టైం చూడబోతున్న సినిమా ఇది కావడంతో ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. మరి దీన్నైతే దర్శకుడు క్రిష్ అత్యద్భుతంగా చూపించారని చెప్పి పవన్ తాలూకా ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్..

అలాగే మల్లయోధులని పడగొట్టి తొడగొట్టి మీసం మెలేసిన రాజసంతో పవన్ ఫ్యాన్స్ కి వీరమల్లు పవర్ గ్లాన్స్ ఒక అదిరే ట్రీట్ అని చెప్పి తీరాలి. అలాగే ఇందులో వినిపించిన లిరిక్ తో కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ ని నెక్స్ట్ లెవెల్లో లేపింది. దీనితో అయితే సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో మరింత స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పి తీరాల్సిందే.

వీరమల్లు పవర్ గ్లాన్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు