వారిద్దరూ నా అభిమాన దర్శకులే – హరీష్ శంకర్

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ కి ఒక ప్రశ్న ఎదురైంది. పాన్ ఇండియా మూవీస్ కల్కి, పుష్ప లాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడగగా అందుకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు హరీష్.

పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వవు, మనం ఒక మంచి సినిమా చేస్తే, అది ఇండియా మొత్తం ఆదరిస్తే, అది పాన్ ఇండియా చిత్రం అవుద్ది. కల్కి లాంటి సినిమాలు చేయడానికి నాగ్ అశ్విన్ ఉన్నాడు, పుష్ప లాంటి సినిమాలు చేయడానికి సుకుమార్ ఉన్నాడు. నేను నా స్టైల్ లో తీస్తా అని అన్నాడు. అంతేకాక ఇద్దరూ కూడా నా అభిమాన దర్శకులే అని అన్నాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మిస్టర్ బచ్చన్ చిత్రం లో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

Exit mobile version