“ఉస్తాద్ భగత్ సింగ్” నెగిటివిటీపై హరీష్ స్పందన

“ఉస్తాద్ భగత్ సింగ్” నెగిటివిటీపై హరీష్ స్పందన

Published on Aug 8, 2024 6:05 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో యంగ్ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ లో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” పై మంచి బజ్ ఉంది. అయితే ఈ సినిమా మొదలు కావడం ఒక స్ట్రైట్ సినిమాగా “భవదీయుడు భగత్ సింగ్” అంటూ మొదలైన ఈ చిత్రం చాలా మార్పులు చేర్పులు తర్వాత సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” గా మారింది.

అయితే ఇక్కడ కూడా ఫ్యాన్స్ హర్ట్ అవ్వలేదు కానీ సినిమా కోలీవుడ్ సినిమా తేరి రీమేక్ గా చేస్తున్నారు అని టాక్ రావడం మాత్రం హరీష్ శంకర్ పై తీవ్ర ఒత్తిడి పెద్ద ఎత్తున నెగిటివిటీ తీసుకొచ్చింది. మరి దీనిపై హరీష్ శంకర్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. కేవలం రీమేక్ చేస్తున్నానని నెపంతో ఏ దర్శకుడు మీద కూడా రాని నెగిటివిటీ ఒక్క నా మీద వచ్చింది అని హరీష్ తెలిపాడు.

నా ఒక్కడి మీదే 2 లక్షల 60 వేలకి పైగా ట్వీట్స్ తో రికార్డు ట్రోలింగ్ నా ఒక్కడి మీదే జరిగింది. కానీ టీజర్ చూసాక చాలా మంది సారీ చెప్పి మెసేజ్ చేశారు. అంతమంది నెగిటివ్ చేసినప్పుడే నా పని నేను ఆపలేదు అలాంటిది ఎవరో ఏదో నాకెందుకు అని కామెంట్స్ చేస్తే నేనెందుకు పట్టించుకుంటాను అని హరీష్ స్పందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు