టాలీవుడ్‌లో తనదైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఆయన తెరకెక్కించే సినిమాలు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి. గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన హరీష్ శంకర్ రీసెంట్‌గా ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా ఫ్లాప్‌గా నిలవడంతో, ఇప్పుడు హరీష్ శంకర్ ఓ సెన్సేషనల్ కాంబినేషన్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈసారి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో హరీష్ శంకర్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. ఇప్పటికే సల్మాన్‌కు ఆయన కథను వివరించాడన.. దీనికి సల్మాన్ కూడా ఓకే చెప్పినట్లుగా సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారట. ఈ సినిమాతో హరీష్ శంకర్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సన్నీ డియోల్‌తో ‘జాట్’ మూవీ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా సల్మాన్ మూవీతో బాలీవుడ్‌పై కన్నేశాడని తెలుస్తోంది. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.