ఫ్యాన్స్ కోరుకునే పవన్ ని హరీష్ చూపిస్తాడట..!

Published on Apr 5, 2020 6:55 pm IST

పవన్ 2018 తరువాత పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. ఓ దశలో ఆయన్ని ఇక సిల్వర్ స్క్రీన్ పై చూడడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు. అభిమానుల ఆశలు తీర్చుతూ ఆయన కమ్ బ్యాక్ ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా వరుసగా మూడు చిత్రాలు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో చిత్రం క్రిష్ తో చేస్తుండగా దాని షూటింగ్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది.

ఐతే పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కాంబినేషన్ మాత్రం హరీష్ శంకర్ మూవీ అని చెప్పాలి. హరీష్ తో కూడా పవన్ మూవీ కమిట్ కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు, పవన్ మేనరిజం, ఆటిట్యూడ్ ఓ రేంజ్ లో తెరపై ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నది కూడా అలాంటి మాస్ మసాలా చిత్రమే. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు పవన్ మార్క్ మేనరిజంతో హరీష్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని టాక్. మరి చూడాలి హరీష్ పవన్ ఫ్యాన్స్ ఆశలను ఎంత వరకు నెరవేర్చుతాడో.

సంబంధిత సమాచారం :

X
More