టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని ప్రారంభించాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు తిరిగి స్టార్ట్ అవుతుందనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో హరీష్ శంకర్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడట.
దీనికోసం ఆయన స్క్రిప్టు వర్క్ ప్రారంభించాడని తెలుస్తోంది. అయితే, హరీష్ శంకర్ ఉస్తాద్ రామ్ పోతినేనితో పాటు నందమూరి బాలకృష్ణతోనూ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. దీనిలో తొలుత రామ్ పోతినేనితో హరీష్ శంకర్ ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్క్రిప్టు వర్క్స్‌కు సంబంధించి హరీష్ శంకర్ కూర్గ్‌లో కథను రెడీ చేస్తున్నారట.
మరి హరీష్ శంకర్ ఈ రెండు స్క్రిప్టులను ఎప్పుడెప్పుడు ఫినిష్ చేస్తాడా.. ఈ సినిమాలను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.