“హరోం హార” నాన్ థియేట్రికల్ డీటైల్స్ ఇవే!

టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు నటించిన హరోం హర చిత్రం థియేటర్ల లో విడుదలై ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. కుప్పం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు గన్‌స్మిత్‌ గా నటించారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ ను ఈటీవీ నెట్ వర్క్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

త్వరలో ఈ చిత్రం ఈటీవీ విన్ లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈటీవీ ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను కలిగి ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ కథానాయికగా నటించడం జరిగింది. ఈ చిత్రంకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Exit mobile version