డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “హరోం హర”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “హరోం హర”

Published on Jul 8, 2024 8:30 PM IST

టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుధీర్ బాబు ఇటీవలి చిత్రాలతో పోలిస్తే, హరోం హర మంచి మౌత్ టాక్ అందుకుంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆహా వీడియో ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది.

స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్ నుండి తాజా అప్డేట్ ఏమిటంటే, ఈ చిత్రం జూలై 11న డిజిటల్‌ ప్రీమియర్ గా అందుబాటులోకి రానుంది. థియేట్రికల్ మరియు ఓటిటి విడుదల మధ్య దాదాపు నాలుగు వారాల గ్యాప్ ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. సుధీర్ బాబుకు జోడీగా మాళవిక నాయర్ నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ మరియు రవి కాలే కీలక పాత్రలు పోషించారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రంకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు