నవదళపతి సుధీర్ బాబు నటించిన రీసెంట్ మూవీ హరోం హర తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రావడం, సుధీర్ బాబు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆడియెన్స్ ఈ సినిమాకు మంచి మార్కులు వేశారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.
నిజానికి ఈ సినిమా ఇదివరకే ఓటిటి స్ట్రీమింగ్ కి రావాల్సి ఉంది. కానీ, ఈ మూవీలో ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ నటించడం.. ఇటీవల అతడు ఓ వివాదంలో ఇరుక్కోవడంతో, అతడికి సంబంధించిన సీన్స్ ను తొలగించేందుకు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ ఆలస్యం అయ్యింది. ఇక ఈ చిత్ర ఓటిటి రైట్స్ ను ఆహా, ఈటీవీ విన్ సొంతం చేసుకున్నాయి.
కాగా, తాజాగా ఈ సినిమాను ఆహాలో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు మేకర్స్. ఇవాళ సాయంత్రం 5 గంటలకు హరోం హర స్ట్రీమింగ్ చేస్తామని తెలిపిన మేకర్స్.. చెప్పిన సమయానికంటే ముందే ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అటు ఈటీవీ విన్ లో ఈ సినిమా జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా, సునీల్, జయప్రకాశ్, అక్షర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. జ్ఞానసాగర్ ద్వారక ఈ సినిమాను తెరకెక్కించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.