అమెజాన్ ప్రైమ్ లో నేషన్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న ‘హ‌రోంహ‌ర‌’


న‌వ‌ద‌ళ‌ప‌తి సుధీర్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ ‘హ‌రోంహ‌ర’ ఇటీవ‌ల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు జ్ఞానసాగర్ ద్వారక తెర‌కెక్కించిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు ప‌ర్ఫార్మెన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు.

ఈ సినిమా ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటిటి స్ట్రీమింగ్ కి వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. కేవ‌లం తెలుగు ఆడియెన్స్ మాత్ర‌మే కాకుండా దేశ‌వ్యాప్తంగా సినిమా ల‌వ‌ర్స్ ఈ చిత్రాన్ని నేష‌న్ వైడ్ గా ట్రెండింగ్ లో కొన‌సాగిస్తున్నారు.

ఈ సినిమాలో మాళ్విక శ‌ర్మ హీరోయిన్ గా నటించ‌గా సునీల్, జ‌య‌ప్రకాశ్ అక్ష‌ర‌, అర్జున్ గౌడ‌, ర‌వి కాలె త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై సుమంత్ జి నాయుడు ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version