క్లీన్ అండ్ ఫన్ గా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” హతవిధీ సాంగ్.!

Published on May 31, 2023 11:58 am IST


రీసెంట్ గా మన టాలీవుడ్ దగ్గర అనౌన్స్ చేసిన ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మరియు సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క లతో ప్లాన్ చేసిన రోమ్ కామ్ డ్రామా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” అనే చెప్పాలి. కొత్త దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇపుడు మంచి బజ్ కూడా నెలకొనగా ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే ఇప్పుడు మరో సాంగ్ ని రిలీజ్ చేశారు.

స్టార్ హీరో ధనుష్ ఆలపించిన హతవిధీ అనే ఈ సాంగ్ అయితే మంచి ఎంటర్టైనింగ్ అండ్ క్లీన్ గా ఉందని చెప్పాలి. నవీన్ నుంచి బాధపడుతూ వచ్చే ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యం అందించగా దానికి క్యాచీ బీట్స్ తో అయితే సంగీత దర్శకుడు రాధన్ మంచి ట్యూన్ ని సెట్ చేసాడు. ఇక సాంగ్ లో విజువల్స్ నవీన్ పై చూపించిన ఫన్ సీన్ మంచి హిలేరియస్ గా కూడా ఉన్నాయి. దీనితో అయితే ఈ సినిమా నుంచి మరో మంచి సాంగ్ ఇపుడు వచ్చింది అని చెప్పొచ్చు.

xవీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :