
విడుదల తేదీ : జనవరి 24, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : రవివర్మ, ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, భరత్ రెడ్డి, రఘునాథ్ రాజు, శివాజీ రాజా తదితరులు.
దర్శకుడు : శ్రీదివ్య బసవ
నిర్మాత :ఎస్ ప్రశాంత్ రెడ్డి
సంగీతం :నరేష్ కుమరన్
ఛాయాగ్రహణం : అభిజార్ నైర్
కూర్పు : అనీల్ కుమార్ పి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో సందడి చేయడానికి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో రవివర్మ, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం “హత్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
2019 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి(భరత్ రెడ్డి) కి చిన్నాన్న అయినటువంటి ధర్మేంద్ర రెడ్డి(రవి వర్మ) ఇల్లెందుల ప్రాంతం, తన ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్య చేయబడతారు. అయితే ఈ కేసు కిరణ్ రెడ్డి ప్రభుత్వంలో సవాలుగా మారగా కిరణ్ రెడ్డి తన ప్రభుత్వంలోనే సిట్ విచారణ జరగాలి అని సుధా రావు(ధన్య బాలకృష్ణ) ని నియమిస్తారు. ఇక్కడ నుంచి విచారణ చేపట్టిన సుధా ఈ కేసులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఈ హత్యకి ఉన్న కోణాలు ఏంటి? అంత అవసరం ఎవరికి ఎందుకు వచ్చింది? అనేవి కనిపెడుతుందా లేదా? ధరేంద్ర రెడ్డి విషయంలో చాలా మందికి తెలియని చీకటి కోణాలు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమా ఆరంభంతోనే ఇందులో కనిపించే హత్య ఎవరిది ఏంటి అనేవి అర్ధం అవుతుంది. అయితే ఈ మర్డర్ మిస్టరీపై ఇది వరకు చాలా థియరీలు పలు సినిమాలు కూడా బయటకి వచ్చాయి. కానీ ఈ చిత్రంలో మాత్రం ఇంకొంచెం డెప్త్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. నిజ జీవితంలో సంచలనం రేపి ఇప్పటికీ మిస్టరీగా ఉన్న ఈ కేసులో ఈ సినిమాలో చూపించిన కొత్త కోణం మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని చెప్పాలి.
అలాగే కథనం అనుసరించి వచ్చే కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు టర్న్ లు కూడా ఒకింత ఆశ్చర్యపరుస్తాయి. అలాగే పలు ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకా ఈ హత్యా చుట్టూతా కేవలం ఒక్కటే కోణం ఉంది అనుకునే చాలా మందికి అదే కాదు ఇంకా మరికొన్ని ఊహించని కోణాలు కూడా ఉన్నాయని కన్విన్స్ చేసిన పాయింట్ ఒక చోట బాగుంది అనిపిస్తుంది.
ఇక సినిమాలో మెయిన్ లీడ్ లో కనిపించిన రవి వర్మ తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిపోయారని చెప్పాలి. ధర్మేంద్ర రెడ్డి పాత్రలో తన లుక్స్ గని నటన గాని చాలా బాగా చేసాడు. అలాగే ధన్య బాలకృష్ణ తన రోల్ లో బాగానే చేసింది. ఇక వీరితో పాటుగా పూజా రామచంద్రన్ మంచి రోల్ లో కనిపించి డీసెంట్ పెర్ఫామెన్స్ ని అందించింది. ఇక గత సీఎం గా భరత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ గా మంచి పెర్ఫామెన్స్ ని ఉన్న కొన్ని సీన్స్ లో కూడా చేసి చూపించారు. ఇలా లీడ్ నటీనటుల్లో దాదాపు అందరు బాగానే చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో లైన్ నిజ జీవితంలో జరిగిన ఓ సంచలన ఘటనపై తీసుకున్నదే అయినప్పటికీ ఈ ఘటనలో నడిచే డ్రామా అంతా ఒకింత బోరింగ్ గా సాగుతుంది అని చెప్పాలి. చాలా సన్నివేశాలు సాగదీతగా ఏమాత్రం ఎగ్జైట్ చెయ్యకుండా అనిపిస్తాయి. అలాగే మెయిన్ గా సెకండాఫ్ అయితే మరీ సాగదీతగా వెళుతున్నట్టుగా అనిపిస్తుంది.
ధర్మేంద్ర రెడ్డి, సలీమా పాత్రల నడుమ ఆ పాటలెందుకో అర్ధం కాదు. వారి నడుమ ఉన్న లవ్ ట్రాక్ ని ఇంకాస్త సెటిల్డ్ గా అర్ధవంతంగా డిజైన్ చేసి తక్కువ నిడివి లోనే కుదించేయాల్సింది. అలాగే ఇదే మర్డర్ మిస్టరీపై వివేకం అనే మరో సినిమా కూడా ఉంది. అయితే అది పొలిటికల్ గా సాగితే ఇది ఫ్యామిలీ పరంగా సాగుతుంది. సో ఆ సినిమా నచ్చినవారికి దీనిని యాక్సెప్ట్ చేసే విధంగా అనిపించకపోవచ్చు.
అలాగే సీనియా క్లైమాక్స్ కి చేరుకునే నాటికి కేవలం ఆస్తి గొడవలు మూలానే ఈ హత్య చేశారు అనే పాయింట్ అంత సంపూర్ణంగా అనిపించదు. అలాగే మరికొన్ని సన్నివేశాలు కూడా అర్ధ రహితంగానే మిగిలిపోతాయి. ఇక వీటితో పాటుగా సినిమాలో చాలా పాత్రలు కథనం నడుస్తున్న కొద్దీ పరిచయం అవుతూనే ఉంటాయి.
వీటితో సగటు ఆడియెన్ అయినా అలాగే రియల్ లైఫ్ లో ఈ కేసు కోసం తెలిసినవారు అయ్యినా కూడా ఒకింత బాగా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా అనిపిస్తుంది. ఇది మరింత చికాకు తెప్పిస్తుంది. ఇంకా ఈ సినిమాలో పోలీస్ రోల్ కి ధన్య బాలకృష్ణ అంత సెట్ అయ్యినట్టుగా కనిపించదు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు నేపథ్యంకి తగ్గ జాగ్రత్తలు నిర్మాణ విలువలు పాటించారు. పాటలు, నేపథ్య సంగీతం కూడా జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ గా ఇంకా బెటర్ గా చేయాల్సింది. చాలా సీన్స్ ని తగ్గించి కథనం ఫాస్ట్ గా నడిపించాల్సింది.
ఇక దర్శకురాలు శ్రీవిద్య బసవ విషయానికి వస్తే.. మంచి మర్డర్ మిస్టరీ లైన్ తీసుకున్నారు కానీ దానిని పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా నడపే ప్రయత్నం ఇంకా డెవలప్ చేసి ఉంటే బాగుండేది. వీరు చూపించినట్టుగా నిజ జీవితంలో ఆయా పాత్రల నడుమ అలా సన్నివేశాలు జరిగాయో లేదో కానీ కొన్ని సీన్స్ మాత్రం ఇలా కూడా జరిగి ఉండొచ్చేమో అనే తరహాలో బాగున్నాయి. కానీ చాలా వరకు సినిమా సాగదీతగా బోరింగ్ గా అనిపిస్తుంది. వీటితో ఈ క్రైమ్ థ్రిల్లర్ ని ఇంకా మంచి ట్రీట్మెంట్ తో షేప్ అవుట్ చేసి ఉంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “హత్య” సినిమాలో మర్డర్ మిస్టరీ చుట్టూతా నడిచే డ్రామా, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్, ట్విస్ట్ లు ఓకే అనిపిస్తాయి కానీ కథనం చాలా సాగదీతగా బోరింగ్ గా సాగుతుంది. ఈ తరహా క్రైమ్ థ్రిల్లర్స్ లో అనవసర డ్రామా పెట్టాల్సిన పని లేదు. వాటి బదులు ఇంకా ఎంగేజింగ్ గా సీన్స్ ని మలచి ఉంటే బాగుండేది. సో వీటితో ఈ హత్య ఇన్వెస్టిగేషన్ మరీ ఆసక్తిగా అనిపించకపోయినా స్ట్రిక్ట్ గా కొన్ని అంశాలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team