గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ సెన్సేషనల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో మంచి ఆదరణ అందుకుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ లేటెస్ట్ గా “RRR బిహైండ్ అండ్ బియాండ్” అంటూ ఓ కొత్త వెర్షన్ లో సినిమా మేకింగ్ కి సంబంధించి రిలీజ్ కి తీసుకొచ్చారు. ఇది కూడా మన దగ్గర లిమిటెడ్ గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ రిలీజ్ ని మేకర్స్ మరింత ముందుకు తీసుకెళ్ళబోతున్నారు.
పక్క రాష్ట్రాల్లో కూడా విడుదలకి ప్లాన్ చేస్తుండగా యూఎస్ లో కూడా థియేటర్స్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్టుగా టీం కన్ఫర్మ్ చేశారు. వచ్చే వారం యూఎస్ థియేటర్స్ లో ఈ RRR కొత్త వెర్షన్ ప్రదర్శితం కానుంది అట. మరి దీనిపై అప్డేట్ కూడా ఇస్తున్నట్టుగా తెలిపారు. మరి యూఎస్ లో కూడా ఈ సినిమాని చాలా మంది ఆదరించారు. మరి ఈ డాక్యు చిత్రానికి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
It’s releasing in USA next week. Will update you 🙂
— RRR Movie (@RRRMovie) December 20, 2024