నగ్నం హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ పెద్దదే..!

Published on Jul 2, 2020 9:33 pm IST


వర్మ నగ్నం కంటెంట్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నా కమర్షియల్ గా సూపర్ సక్సెస్. ఓ చిన్న షార్ట్ ఫిలిం బుడ్జెట్ తో తెరకెక్కిన నగ్నం మూవీ వర్మకు కోట్లు తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీలో నటించిన స్వీటీ అలియాస్ శ్రీ రాపాక, దెబ్బకు ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలలో ఆమెకు మంచి క్రేజ్ వచ్చి చేరింది. ఆ క్రేజ్ తో ఆమెను అనేక చానళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. దీనితో శ్రీ రాపాక బ్యాక్ గ్రౌండ్ మొత్తం బయటికివస్తుంది .

కాగా శ్రీ రాపాక గోదావరి జిల్లాలకు చెందిన అమ్మాయి. ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రీ రాపాక ఇంటర్ పూర్తి అయిన వెంటనే.. హైదరాబాద్ నిఫ్ట్ లో జాయిన్ అయ్యారట. ఆ తరువాత యూఎస్ లో మాస్టర్స్ చేశారట. తెలుగు, తమిళ్ మరియు కన్నడ పరిశ్రమలకు చెందిన 40 చిత్రాల వరకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిందట. అనేక టీవీ షోల్లో పాల్గొన్న ఈమెను శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్క పాత్రకు సంప్రదించగా, చేయనని అన్నారట.ఇక వర్మ చెప్పిన సమయానికి ఓ హీరోయిన్ రాకపోవడంతో నగ్నంలో ఈమెకు అవకాశం వచ్చిందట.

సంబంధిత సమాచారం :

More