మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం కోసం తెలిసిందే. మహేష్ కెరీర్ లో ఈ సినిమా 28వ సినిమాగా ఇది తెరకెక్కుతూ ఉండగా దీనిపై భారీ హైప్ కూడా ఉంది. అయితే ఈ సినిమా నుంచి నిన్నటి నుంచి మంచి హాట్ టాపిక్ గా నిలవగా ఈ చిత్రానికి భారీ ఓటిటి డీల్ అయితే దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చినట్టుగా వార్తలొచ్చాయి. మరి దీనిపై ఇప్పుడు లేటెస్ట్ అసలు క్లారిటీ అయితే మేకర్స్ నుంచి వచ్చింది.
ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ నుంచి అన్ని భాషల్లో 80 కోట్ల ఆఫర్ వచ్చిన మాట నిజమేనట. ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ తో మేకర్స్ 81 కోట్ల కి డీల్ క్లోజ్ చేయగా ఈ చిత్రం అందులో సినిమా థియేట్రికల్ గా రిలీజ్ అయ్యిన 50 రోజుల తర్వాతే అందుబాటులోకి వస్తుందని కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే మహేష్ 28 పై వచ్చిన వార్తలు అయితే నిజమే కాగా ఇంకో కోటి ఎక్కువే ఈ సినిమాకి వచ్చింది. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.