హీరో నితిన్ తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. ఆయన హీరోగా చేసిన శ్రీనివాస కళ్యాణం మూవీ విడుదలై ఏడాది దాటిపోయింది. ఐతే వరుసగా నాలుగు చిత్రాలు చేస్తున్న నితిన్ భీష్మ మూవీ ఈనెల 21న విడుదల కానుంది. దర్శకుడు వెంకీ కుడుముల రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా భీష్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు ఈ మూవీ నుండి సరా సరి… అనే సాంగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియోని విడుదల చేశారు.
రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో విడుదల చేయనున్నారు. భీష్మ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సరా సరి సాంగ్ కి శ్రీ మణి సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. ఇక పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ ఆహ్లాదకరంగా ఉంది. భీష్మ చిత్రంతో మొదటిసారి రష్మిక, నితిన్ సరసన నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.