మహేష్ సినిమాలో పవన్ ఉన్నాడా.?క్లారిటీ తెలుసుకోండి.!

Published on Dec 5, 2020 7:09 am IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారని పలు రూమర్స్ ఓ రేంజ్ లో ఇప్పుడు ఊపందుకున్నాయి.

అయితే మామూలుగానే పవర్ స్టార్ అండ్ సూపర్ స్టార్ అనే రెండు ట్యాగ్స్ పక్కపక్కన వింటేనే హై ఎండ్ ఎనర్జీను ఇరు హీరోల అభిమానాలు ఫీలవుతారు. మరి అలాంటిది ఓకే స్క్రీన్ పంచుకుంటే ఇక బాక్సాఫీస్ మోత వేరే లెవెల్లో ఉంటుంది అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

మరి అలా ఈ టాక్ రావడంతో ఇంతకీ అది నిజమా కాదా అన్న సంశయంలో ఉన్నారు. ఇప్పుడు దీనిపై క్లారిటీ అందిస్తున్నాం. మాకు తెలిసినదాని ప్రకారం అసలు ఈ చర్చే లేదని ఇవన్నీ ఒట్టి ఫేక్ వార్తలే అని తెలుస్తుంది. సో ఈ సెన్సేషనల్ కాంబో పై వచ్చిన వార్తలు అన్నీ ఒట్టి గాలి వార్తలే ఎవరు నమ్మనవసరం లేదు.

సంబంధిత సమాచారం :

More