ఓటిటి: “కల్కి 2898 ఎడి” రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.!

ఓటిటి: “కల్కి 2898 ఎడి” రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.!

Published on Jul 16, 2024 5:32 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని రీచ్ అయ్యి భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక సినిమా వచ్చి రెండు వారాలు అయినప్పటికీ థియేటర్స్ లో సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుండగా చాలా మంది ఓటిటి రిలీజ్ ఎప్పుడు అనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు సాలిడ్ అప్డేట్ తెలుస్తుంది.

కల్కి 2898 ఎడి రిలీజ్ అయ్యిన నాటి నుంచి మరో 10 వారాలు వరకు ఏ ఓటిటిలో కూడా వచ్చే ఛాన్స్ లేదట. అంటే రెండు నెలల 10 రోజులు వరకు కల్కి ని ఓటిటి లో చూడడం కుదరదు. సో ప్రస్తుతానికి ఓటిటిలో చూద్దాం అన్ని సినిమాల్లానే ఇది కూడా నెల లోపే వచ్చేస్తుంది అని ఆగిపోయే వాళ్ళు మాత్రం ఇంకో రెండు నెలలు ఆగాల్సిందే. ఇక ఈ భారీ చిత్రంకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు కీలక పాత్రల్లో నటించారు. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు