విజయ్, సత్యదేవ్ సినిమాల టీఆర్పీ రేటింగ్స్ ఇవే.!

Published on Sep 24, 2020 1:59 pm IST

ఎన్నో అంచనాలు నడుమ టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మొత్తం నలుగురు హీరోయిన్స్ తో ప్లాన్ చేసిన ప్రేమ కథా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కాబడిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లో మరో పరాభవ చిత్రాల జాబితాలో పడిపోయింది.

ఇక అలాగే ఆ తర్వాత లాక్ డౌన్ మూలాన మరో టాలెంటెడ్ హీరో సత్య దేవ్ హీరోగా నటించిన చిత్రం “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” నేరుగా ఓటిటిలో విడుదల అయ్యి మంచి టాక్ ను సంతరించుకుంది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా గత రెండు వారాల కితం స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ అయ్యాయి.

సత్య దేవ్ చిత్రాన్ని తెలుగు టాప్ 3 ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీలో వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయగా విజయ్ చిత్రాన్ని జెమినీ టీవీ వారు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేసారు. ఈ రెండు చిత్రాలు కూడా మంచి టీఆర్పీ రేటింగ్ నే సాధించాయి. మొదటగా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య విషయానికి వస్తే..

ఈ చిత్రం 5.1 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ రాబట్టగా వరల్డ్ ఫేమౌస్ లవర్ చిత్రానికి 5.8 టీఆర్పీ వచ్చింది. ఈ రెండు చిత్రాలకు కూడా ఇది మంచి స్థాయి రేటింగ్ అనే చెప్పాలి. వీటిలో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి కె క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా సత్యదేవ్ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం అందించారు.

సంబంధిత సమాచారం :

More