న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది, ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లోనే రూ.15.90 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా రెండో రోజు రూ. 7.80 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది.
పైగా ఈ రోజు ఆదివారం కావడంతో, ఈ సినిమా ఇంకా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. మొత్తానికి కోర్ట్, బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని సాధించింది. రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా ఇంకా ఎక్కువ వసూళ్లు చేస్తుందనే అంచనా ఉంది. మొత్తమ్మీద ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.