‘కోర్ట్’కి భారీ కలెక్షన్లు.. 9 రోజుల్లో ఎంతంటే ?

‘కోర్ట్’కి భారీ కలెక్షన్లు.. 9 రోజుల్లో ఎంతంటే ?

Published on Mar 23, 2025 9:00 AM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై 9 రోజులు అవుతున్నా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది, ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో రూ.46.80 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా 9వ రోజు గ్రాస్ రూ. 4.50 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది.

నిన్న ఆదివారం కావడంతో కోర్ట్ కి కలెక్షన్స్ పెరిగాయి. ఐతే, ఇక ఈ రోజు నుంచి వర్కింగ్ డేస్ కావడంతో.. మరి ఈ సోమవారం నుంచి ఏ రేంజ్ కలెక్షన్స్ ను సాధిస్తోందో చూడాలి. మొత్తానికి కోర్ట్, బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని సాధించింది. మొత్తమ్మీద ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. అలాగే యూఎస్ లో కూడా 9 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం నెక్స్ట్ 1 మిలియన్ చేరుకోబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు